మెహ్రీన్ లక్కు మాములుగా లేదు…

Mehreen to romance Gopichand

మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హిందీ భామ మెహ్రీన్ కౌర్ పిర్.  కృష్ణగాడి వీర ప్రేమ గాథతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది మూడు సినిమాలే ఐనా తన అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.  కృష్ణగాడి వీర ప్రేమగాథ ,  మహానుభావుడు,రవితేజ రాజా  ది గ్రేట్‌తో హ్యాట్రిక్‌ హిట్ కొట్టిన ఈ బ్యూటీ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది.

త్వరలో జవాన్‌తో ప్రేక్షకుల ముందుకురాబోతోంది మెహ్రీన్. ఐతే కేరాఫ్ సూర్య వరకు పద్దతిగానే కనిపించిన మెహ్రీన్‌ జవాన్‌లో మాత్రం మరో యాంగిల్ చూపించబోతోంది. ఇక గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు చక్రి ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరికి మెహ్రీన్ ను ఖరారు చేశారట.  మొత్తంగా మెహ్రీన్ పట్టిందల్లా బంగారమే అవుతోంది.