మిషన్ భగీరథ యాప్ విడుదల…

Mission Bhagiratha app release

వేల కోట్లు ఖర్చు పెట్టి కొన్నిప్రాంతాలకే నీటిని సరఫరా చేయడం సరైంది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రమంజిల్‌లో మిషన్‌ భగీరథ వెబ్ సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేటీఆర్  వచ్చే వేసవి నాటికి ప్రతీ ఇంటికి నీరిచ్చితీరుతామన్నారు. గోదావరి, కృష్ణ నదుల నుంచి వచ్చే నీటికి ఇంటర్‌ కనెక్టివిటీ లేదని…ఈ రెండు నదుల కనెక్టివిటీ ద్వారా నీటిని ఇచ్చేలా ప్రణాళిక ఉండాలన్నారు.

అధికారులు ఈ 9 నెలలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కేటీఆర్. మిషన్ భగీరథ పైపులతో పాటు సమాంతారంగా పైబర్ గ్రిడ్ లైన్లను ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. 80 శాతం అనారోగ్య సమస్యలు నీటి వల్లే వస్తాయని…ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తే ఎప్పటికీ అదే గొప్ప పని అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రోడ్ల విషయంలో సరైన ప్రణాళికలతో ముందుకుసాగాలన్నారు.

వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకున్న నీటిని అనుసంధానం చేయలన్నారు. మిషన్ భగీరథ అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మద్దతు తీసుకుని ముందుకు పోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల కోసం పని చేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలుంటే కాంప్లికేట్ చేయవద్దని, అందరూ సమన్వయంతో ముందుకెళ్తే అనుకున్న సమయంలో పనులు పూర్తి అవుతాయన్నారు కేటీఆర్.