హే ఇందూ అంటున్న ఎమ్మెల్యే

MLA Movie Songs

బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’, మరొకటి ‘నా.. నువ్వే’ . సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఎమ్మెల్యే ‌(మంచి లక్షణాలున్న అబ్బాయి)టీజర్‌కు మంచి స్పందన రాగా తాజాగా రెండోసాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

మార్చి 23న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా మణిశర్మ సంగీతం అందించిన హే ఇందూ సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేస్తోంది. కల్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సి భరత్ చౌదరి,ఎంవి కిరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘లక్ష్మీ కల్యాణం’ తరువాత కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.