డైలాగ్ కింగ్ వస్తున్నాడు…

Mohan Babu stuns the crew of 'Gayatri'

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం గాయత్రి. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ప్రమోషన్స్ వర్క్స్‌ను వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఈ మూవీ టీజర్‌ను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయనుండగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురిగా టైటిల్ పాత్రలో నటించగా ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.

సాంకేతిక వర్గం:సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్,నిర్మాత: డా. మోహన్ బాబు యమ్,దర్శకత్వం: మదన్ రామిగాని.