గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న “మోని”

moni movie

షాలిని, నందికొండ వాగుల్లోనా లాంటి చిత్రాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లక్కీఏకారి , నజియా, హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై… రంజిత్ కోడిప్యాక సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో “మోని చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగు హిందీ భాష‌ల్లో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. భారీ యాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవా లో మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.

Moni-movie-shooting-i

ఈ సందర్బంగా చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేస్తూ .. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. షాలిని, నందికొండ వాగుల్లోనా వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్కీ ఏకారి , బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న నజియా హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. దాంతో పాటు బడ్జెట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Moni-movie-shooting

దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ …ఈ చిత్రలో రెండు పాటలు నాలుగు భారీ ఫైట్లు ఉంటాయని, బాలీవుడ్ హీరోయిన్ నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తీ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ లో రెండో చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది అన్నారు. ఈచిత్రంలో సుమ‌న్ శెట్టి, దిల్ ర‌మేష్, స‌న్నీ టావో ప‌లువురు న‌టిన‌టులు నటిస్తున్నారు.