ఫన్ టైం.. అంటూ ఎంజాయ్‌ చేస్తోన్న ధోనీ…

MS Dhoni Enjoys Break From Cricket, Posts Beautiful Video With Family

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. కాస్త సమయం దొరకగానే ధోనీ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ..తన మద్దుల కూతురు జీవాతో చిన్న చిన్న ఆటలాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

తాజాగా ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్‌ చేశాడు. జీవాతో పాటు తన భ్యార్య సాక్షీతో గడిపిన మధుర జ్ఞాపకాల ఫొటోలను ఆల్బమ్‌ గా రూపొందించిన అడోరబుల్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. దాంతోపాటు  ఫన్ టైమ్‌ విత్‌ ది ఫ్యామిలీ అని క్యాప్షన్‌ కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియోని చూసిన ధోనీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇక ధోనీ ఫ్యామిలీతో ఎంజాయ్‌ చెయ్యడానికి కారణం..శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ధోనీకి విశ్రాంతినివ్వడమే. ధోనీతో పాటు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ,బుమ్రా,భవనేశ్వర్‌లతో పాటు పలువురు ఆటగాళ్ళకు విశ్రాంతిన్నిచ్చారు.

Fun time with the family

A post shared by M S Dhoni (@mahi7781) on