కట్టప్ప కూతురిపై హత్యాయత్నం.. మోడీకి ఫిర్యాదు

Murder attempt on satyaraj daughter
Murder attempt on satyaraj daughter

బాహుబలి-2 సినిమా విడుదలయ్యేంత వరకు సగటు సినీ ప్రేక్షకుడికి పరీక్ష పెట్టిన ప్రశ్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? ఈ ప్రశ్నతో కట్టప్పగా సత్యరాజ్ ఎంతో ఫేమస్ అయిపోయాడు.. ఇటీవల బాహుబలి 2 విడుదల తరువాత సత్యరాజ్ కూతురు దివ్య.. మీడియా దృష్టిలో పడింది.. కట్టప్ప రహస్యం కనీసం తనకు కూడా చెప్పలేదంటూ మీడియాలో నిలిచింది దివ్య.. తాజాగా దివ్యను చంపేస్తామంటూ విదేశీయులు బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే.. దివ్య ప్ర‌స్తుతం వైద్యురాలిగా విధులు నిర్వ‌ర్తిస్తుంది. అమెరికాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్‌ సంస్థ తయారుచేసిన టాబ్లెట్‌లో విటమిన్ల ఓవర్‌డోస్‌ ఉన్నట్లు గుర్తించిన న్యూట్రీషనిస్ట్‌ దివ్య.. వాటిని రోగులకు సూచించేందుకు తిరస్కరించారు. దీంతో ఆమెకు ఆ విదేశీ సంస్థ తరఫున కొందరు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె నిరాకరించడంతో చంపుతామని బెదిరించినట్లు ప్రధాని మోడీకి ఫిర్యాదుచేస్తూ శుక్రవారం ఆమె లేఖ రాశారు.

కొన్నిరోజుల క్రితం ముగ్గురు తన క్లినిక్‌కి వచ్చారని.. మల్టీవిటమిన్‌, కొవ్వు కరిగించే మందులను పెషేంట్లకు ప్రిస్క్రిప్షన్‌లో రాసివ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని.. అయితే శాస్త్రీయ కాలపరిమితి లేకుండా మందులను రాసివ్వనని చెప్పడంతో.. తనను బెదిరించారన్నారు. భారత్‌లో రాజకీయవేత్తలతో వాళ్లకు పరిచయం ఉందని వారన్నారని.. అందుకే ప్రధానికి ఫిర్యాదు చేశానని దివ్య చెప్పారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. ఎవరు కూడా భయటకు చెప్పే ప్రయత్నం చేయరు.. దివ్య ధైర్యం చేసి మోడీకి ఫిర్యాదు చేయడం గొప్ప విషయం అంటూ దివ్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి..