రివ్యూ: నా నువ్వే

naa nuvvey review

రొటీన్ సినిమాల తర్వాత సరికొత్తగా నందమూరి హీరో లవర్‌ బాయ్‌గా కళ్యాణ్ రామ్ వస్తున్న చిత్రం నా నువ్వే. లవ్ అండ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లవర్ బాయ్‌గా కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం..

క‌థ‌:

మీరా(త‌మ‌న్నా) రెడియో జాకీ. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా త‌న ప్రేమ క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా స్టార్ట్ అవుతుంది. పిహెచ్‌డీ చేసి అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు వరుణ్‌(కళ్యాణ్ రామ్). అయితే ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రతిసారి ఏదో కారణంతో ఫ్లైట్ మిస్ అవుతుంటాడు. వరుణ్‌కు పెళ్లి చేసే క్రమంలో ఓ పుస్తకాన్ని కొనిస్తుంది బామ్మ. ఆ పుస్తకాన్ని మిస్ చేసుకుంటాడు వరుణ్‌. అది మీరాకు దొరుకుతుంది. సీన్ కట్ చేస్తే ఇద్దరు కలుస్తారు. వరుణ్ ప్రేమలో పడుతుంది మీరా. అయితే మీరాకు ప్రేమ పరీక్ష పెడతాడు వరుణ్‌? అసలు వరుణ్ పెట్టిన పరీక్ష ఏంటీ? అందులో మీరా నెగ్గిందా..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందో తెరమీద చూడాల్సిందే.

 naa nuvve

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సంగీతం,పాటలు,కళ్యాణ్‌ రామ్,తమన్న. సినిమా చాలా కూల్‌గా ఉంది. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌నే భావన ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ హీరోగానే మెప్పించిన క‌ల్యాణ్‌రామ్‌లో కొత్త‌కోణం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేకపోవడం,అక్కడక్కడ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. బిత్తిరి స‌త్తి , వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్ రామ‌లింగ్వేర స్వామి కామెడీ మెప్పించ‌లేదు. పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ల్లోని ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ మిస్ అయ్యింది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. దీంతో సినిమా సాగదీసిన భావన కలుగుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేనిపిస్తుంది. శ‌ర‌త్ అందించిన సంగీతం బాగుంది. ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించాడు. నేప‌థ్య సంగీతం సూపర్బ్. పీసీ శ్రీరామ్ అద్భుతమైన కెమెరా పనితనంతో మరోసారి మాయ చేశారు. డైరెక్ట‌ర్ జ‌యేంద్ర సినిమాపై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

 naa nuvve

తీర్పు:

ఇదో అందమైన ప్రేమ కథా చిత్రం. దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు. జయేంద్ర డైరెక్షన్, తమన్నా.. కళ్యాణ్ రామ్‌ల పెర్ఫామెన్స్ బాగుంది. కథ మొత్తం కూల్‌గా సాగి క్లైమాక్స్ చిన్న ట్విస్ట్‌తో అందమైన ముగింపు ఇచ్చారు. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ ‘నా నువ్వే’ .

విడుదల తేది:14/06/2018
రేటింగ్: 2.25/5
నటీనటులు: న‌ంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా
సంగీతం: శ‌ర‌త్‌
నిర్మాత‌లు: కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి
ద‌ర్శ‌క‌త్వం: జ‌యేంద్ర‌