నాగ్‌-ఆర్జీవీ మూవీ కాపీనా..!

Nag-RGV movie copy from hollywood..!

నాగ్-ఆర్జీవీ కాంబినేషన్‌లో 28 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీ ‘శివ’. టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసింది. శివ సినిమాకు ముందు తర్వాత అనేలా టాలీవుడ్ రేంజ్‌ని పెంచేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతుండగా ఈ మూవీ లో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

నాగ్ సరసన మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి కథానాయికగా నటిస్తుంది. కంపెనీ బేనర్ లో వర్మ నిర్మిస్తున్న ఈ మూవీలో కింగ్ నాగ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడని టాక్‌. అయితే, విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టేకెన్ అనే ఇంగ్లీష్ సినిమా కథ ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట.

Nag-RGV movie copy from hollywood..!

మరి ఈ సినిమా కథ హాలీవుడ్ మూవీ నుంచి కాపీకొడుతున్నారా లేదా తెలియాలంటే ఆర్జీవీ స్పందించాల్సిందే. ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ప్రెంచ్‌ సినిమా లార్గో వించ్‌కు కాపీగా తెరకెక్కగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించలేకోయింది.

Nag-RGV movie copy from hollywood..!