సమంత ‘సీక్రెట్స్ చైతూ చెప్పేశాడు..

Naga Chaitanya on About Samantha

నాగ చైతన్య -సమంతలు ప్రేమించుకున్నారు, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న సంగతి తెలిసిందే, ఎప్పుడెప్పుడా అని ఆ శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు ఇటు అభిమానులు అటు ప్రేక్షలు. ప్రేమమ్, రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్ ని అందుకున్న చైతూ ఇప్పుడు ‘యుద్ధం శరణం’ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ట్రైలర్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది.

Naga Chaitanya on About Samantha

ఈ సినిమా ప్రమేషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు. తన మొబైల్ లో ఎప్పుడు ఒక ఫెరారీ కారు ఫోటో వాల్ పేపర్ గా ఉంటుందట. అంతే కాకుండా తనకు కాబోయే భార్య గురించి కూడా చైతు చిన్న విషయాన్ని చెప్పాడు. సమంతకి కోపం వచ్చినపుడు చాలా సీరియస్ గా చూస్తుందట. కానీ గొడవలు ఏమి పెట్టుకోదని చెప్పాడు.

Naga Chaitanya on About Samantha

అలాగే సమంత కంటే అందమైన అమ్మాయి మరొకరు లేరని చైతు తనకు కాబోయే భార్యను ఆకాశానికి ఎత్తేశాడు. సమంత అనగానే తనకు మొదట గుర్తుకొచ్చేది ప్రపంచంలోనే ఓ గొప్ప మనిషి అని చెప్పాడు. ఇక తమ ప్రేమ కథను ఎవరైనా సినిమాగా తెరకెక్కిస్తే ఏ మాత్రం అభ్యంతరం చెప్పానని ఈ అక్కినేని హీరో చెప్పేశాడు.