హర్రర్ మూవీలకు దూరమంటున్న చైతు..

కొద్దికాలం కిత్రం వచ్చిన హర్రర్ కామెడీ ‘రాజుగారి గది’ సినిమా ఎంత సక్సెస్‌ సాధించిందో తెలిసిందే. బుల్లితెర యాంకర్‌ ఓంకార్‌ దీనికి దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే రాజు గారి గది 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నాగార్జున నటిస్తుండగా.. ఆయన కోడలు సమంత ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాను చూడనని సమంత భర్త, నాగార్జున కొడుకు నాగచైతన్య చెప్పాడు.

ఇంతకు నాగచతైన్య ఈ సినిమాను ఎందుకు చూడనని చెప్పాడు అని అనుకుంటున్నారా… దీని వెనుక ఓ కారణముంది. అదేంటంటే.. నాగచైతన్యకు హర్రర్ సినిమాలంటే చాలా భయమట. ఇప్పటివరకు హర్రర్ మూవీలకు తాను చాలా దూరంగా ఉన్నానని, ‘రాజుగారి గది-2’ సినిమాను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడనని అంటున్నాడు చైతన్య. నాగార్జున కూడా తన కొడుక్కు ఈ సినిమా చూడొద్దని సలహా ఇచ్చాడట.

Naga Chaitanya plans to avoid watching Raju Gari Gadhi

సమంత ఆత్మగా నటించిన రాజుగారి గది 2 చిత్రం చూసావంటే సమంతతో కలిసి ఒకే గదిలో పడుకోలేవు.. అంతగా భయపెడుతుంది అని నాగచైతన్యకు సలహా ఇచ్చాడట. దీంతో ఖంగుతిన్న చైతూ భయపడి ఈ సినిమా చూడడని చెప్పాడు.. ఈ సినిమాలో సమంత దెయ్యం పాత్రలో నటిస్తోంది. క్లైమాక్స్ లో సమంత భయపెట్టే తీరు చూస్తే నిజంగా థియేటర్లలో ప్రేక్ష కుల వెన్నుల్లో వణుకు పుడుతుందని, ఈ సినిమాను చూస్తే సమంతతో కలిసి ఒకే గదిలో కలిసి ఉండలేవని చెప్పాడట నాగ్. దీనికి స్పందించిన నాగచైతన్య ఈ సినిమాను చూడడని చెప్పాడట. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.