నాగ్‌, నాని మల్టీ స్టారర్ రిలీజ్ డేట్..

అక్కినేని నాగార్జున-నానిల క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన కాలనీ సెట్లో జరుగుతోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్‌.

Nagarjuna And Nani Multi Starrer Movie Release Date

ఈ మల్టీస్టారర్ మూవీ వినాయక చతుర్థి కానుకగా సెప్టెంబరు 12న రిలీజవుతుందట. 13న పండుగ కాగా.. ఒక రోజు ముందే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ రోజు బుధవారం కావడం విశేషం. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకోవడానికి ఇలా సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వారాంతంలో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశముంటుంది. వేసవితోనే తెలుగులో భారీ సినిమాల హవాకు తెరపడింది. మధ్యలో మీడియం రేంజి సినిమాలే వస్తాయి.

ఇక రాబోయే పెద్ద సినిమా అంటే ఇదే అవుతుంది. కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయనడంలో సందేహం లేదు. హైప్ కు తగ్గట్లే సినిమా అంటే పెద్ద విజయం సాధించే అవకాశముంటుంది. ఈ చిత్రాన్ని వినాయక చవితికి రిలీజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. సినిమాలో చతుర్థి నేపథ్యంలో ఒక పాట కూడా ఉంటుందట. ఆ నేపథ్యంలో పండక్కి సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించారు. ఇందులో నాగ్ డాన్ పాత్ర చేస్తుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. నాగ్ సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్నా నటించనున్నారు.