సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగార్జున

Nagarjuna meets cm kcr
Nagarjuna meets cm kcr

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు ఇటీవలె ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కంటి ఆపరేషన్ అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్‌ను నాగార్జున పరామర్శించారు. నాగార్జునతోపాటు ఆయన సోదరుడు అక్కినేని వెంకట్ సీఎంను పరామర్శించారు. ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపినాథ్ లు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు సీఎంను కలిసిన వారిలోఉన్నారు.

KKP_9163

అక్టోబర్లో నాగచైతన్య, సమంతల పెళ్లి పెట్టుకున్న నేపథ్యంలో నాగార్జున సిఎం కేసీఆర్‌ను కలవడం విశేషం. వచ్చేనెల 6వ తేదీన గోవాలో అత్యంత సన్నిహిత బంధుమిత్రుల మధ్య హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు పూర్తి కానుంది. అయితే, ఈ పెళ్లి వేడుకకి ఎక్కువ మందిని ఆహ్వానించడంలేదు కనుక అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడట కింగ్ అక్కినేని నాగార్జున.