నాని,నాగ్‌ మల్టీస్టారర్‌లో రకుల్

Nagarjuna-Nani multi starrer in February

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. తమ తమ అభిమాన నటులు వెండితెరపై కలసి నటించంచడాన్ని తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ స్వాగతిస్తుంటారు. ఇప్పటికే వచ్చిన పలు మల్టీస్టారర్ సినిమాలు గొప్ప విజయాలు సొంతంచేసుకోగా తాజాగా ఆజాబితాలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని చేరనున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ‘భలేమంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలతో హిట్స్ సాధించిన శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని భావిస్తున్నాడట.

Nagarjuna-Nani multi starrer in February

ఫిబ్రవరిలో ఈ మూవీని సెట్స్‌ మీదకు వెళ్లనుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రానికి నటీనటులు, అలాగే సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొట్టేసింది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న రకుల్ ఈ సినిమాకు సంతకం చేసింది. ర‌కుల్ బాలీవుడ్‌లో ‘ఐయారి’ సినిమా చేసింది. 2018 జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.