నందమూరి MLA…సంక్రాంతి గిఫ్ట్

Nandamuri Kalyanram MLA Sankranthi Gift

నందమూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న మూవీ ఎం ఎల్ ఎ(మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి|). ఈ మూవీ ద్వారా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.. క‌ళ్యాణ్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా, భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సంక్రాంతి సందర్భంగా గిఫ్ట్ అందించేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 14 రోజున ఉదయం 10.49ని.లకు టీజర్ విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక కళ్యాణ్ రామ్ .. 59 ఏళ్ల రైటర్ జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నాడు . ‘నా నువ్వే’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుంది.

ఇటీవలె విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనే ట్యాగ్ లైన్‌ వస్తున్న ఈ మూవీ కల్యాణ్ రామ్ కి 15వ సినిమా. ఈ సినిమాలో ఆయన క్లీన్ షేవ్ తో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. ‘లవ్ 100’ ఎఫ్ ఎమ్ ఆర్జే గా తమన్నా అలరించనుంది.