గజదొంగగా నాని…

Nani

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‎ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్‎లో సంజయ్‎దత్ బయోపిక్ తెరికెక్కుతున్న విషయం తెలిసిందే. సంజయ్ పాత్రలో రణ్‎బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‎కి మంచి స్పందన లభిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి బయోపిక్ గా విడుదలైన మహానటి మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు ఎన్టీఆర్, వైస్సాఆర్, కాంతారావు, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‎లు తెరకెక్కుతున్నాయి.

Nani

ఇక ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి బయోపిక్‎లో మెగాస్టార్ నటిస్తుండగా… కోడి రామ్మూర్తి నాయుడు, స్టూవర్టుపురం గజదొంగ టైటర్ నాగేశ్వరరావు బయోపిక్‎ లలో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఇప్పటికే రానా అనేక ప్రాజెక్టులను ఒప్పుకోవడం వలన.. ఈ రెండు బయోపిక్‎లకు సమయం కుదరడం లేదు. ఇక టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ నుంచి రానా తప్పుకున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు నుంచి రానా తప్పుకోవడంతో.. దర్శక నిర్మాతలు నెచురల్ స్టార్ నానిని సంప్రదించగా.. నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన నాగేశ్వరరావు.. చివరికి ఎన్‎కౌంటర్‎లో మరణించాడు. నాని నటిస్తున్నఈ చిత్రానికి ‘కిట్టువున్నాడు జాగ్రత్త’ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.