నాగ్‌తో నాని..

మల్టీస్టారర్స్ కి టాలీవుడ్ కెరాఫ్ అడ్రస్ గా మారబోతుంది. మెల్లమెల్లగా ఊపందుకుంటున్న ఈ కొత్త ట్రెండ్‌ని ఎంకరేజ్ చేయడానిక రీసెంట్‌గా పవర్ స్టార్, ప్రిన్స్ లు ముందుకొస్తే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ కు పవన్ కూడా మరింత బూస్ట్ నిస్తుండంతో..ఇక మిగతా హీరోలు కూడా ఈ మల్టీస్టారర్ల బాట పడుతున్నారు. ఆల్రేడి పాండవులు పాండవులు తుమ్మెదతో మంచు ఫ్యామిలీ…మనంతో అక్కినేని ఫ్యామిలీస్ ఈ మల్టీస్టారర్స్ కి వెలకం చెప్తే..ఇప్పుడు నాని కూడా ..ఓ మల్టీస్టారర్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు.

Nani And Akkineni Nagarjuna Multi Starrer Fix

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనన్నది తాజా సమాచారం. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ‘భలేమంచి రోజు’ .. ‘శమంతకమణి’ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య, నాగ్ .. నాని కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకున్నాడట.

ఆ స్టోరీ లైన్‌ను నాగ్ .. నానిలకు వినిపించాడు. ఇద్దరినీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పించాడని అంటున్నారు. అయితే ‘రాజుగారి గది 2’ చేసిన నాగార్జున, ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక నాని ప్రస్తుతం చేస్తున్నవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ – నాని కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.