నాని…సింగిల్‌ ట్రాక్‌తో వస్తున్నాడు

Nani Krishnarjuna Yudham song release tommrow

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని. ఎంసీఏ సినిమాతో డబుల్ హ్యాట్రిక్‌ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే టీజర్‌తో అలరించిన చిత్రయూనిట్ తాజాగా సింగిల్‌ ట్రాక్‌తో రానున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకు ఉరిమే మనసు సాంగ్‌ను విడుదల చేయనున్నారు. టీజర్‌లో యాడున్నార్రా గోపికలు..అంటూ మొదలుపెట్టిన నాని అవతలి వాళ్లను మనం ఎంత కొరుకుంటున్నామో మన కళ్లల్లో వాళ్లకు కనబడాలి.ఆడోళ్లు భలే కఠినాత్ములు..రామాయణం అంతా విని రాముడికి ధర్మరాజు ఏమవుతాడు అన్నట్లు ఉందని చెప్పే నాని వేరియేషన్ డైలాగ్‌లు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనుండగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పరమేశ్వరన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.