వరంగల్‌ రోడ్ల మీద నాని రచ్చ..

Nani MCA movie shooting in warangal

నాని.. ఓ స్టార్. మామూలు స్టార్ కాదండోయ్..నేచురల్ స్టార్‌. నాని ఏం చేసినా నేచురల్ గానే ఉంటుంది. అందుకే నానికి ‘నేచురల్‌’ అనే టైటిల్‌ ని తగిలించేసింది టాలీవుడ్‌. అయితే నాచురల్ గా కనిపించే నాని ఇప్పుడు వరంగల్‌ రోడ్ల మీద రచ్చ చేస్తున్నాడు. అదేంటి..? బుధ్ధిగా ‘ఎంసీఏ’ చేస్తున్నాడు కదా..మరి ఈ రచ్చ ఏంటీ..అనుకుంటున్నారా..? నాని ప్రస్తుతం ‘ఎంసీఏ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. కానీ.. ఆ సినిమాషూటింగ్‌ లో భాగంగానే వరంగల్‌ రోడ్లపై చెక్కర్లు కొట్టేస్తున్నాడు.

వరంగల్‌లో తీస్తున్నఈ సినిమా షూటింగ్  స్టిల్స్ ను చిత్ర యూనిట్‌ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నాని బైక్‌పై కూర్చుని న‌టిస్తుండ‌గా తీసిన ఫొటోలను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడీ ఫొటోలే సోషల్‌ మీడియాలో గిరగిరా తిరిగుతూ రచ్చ చేసేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ..దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌లో అధిక భాగం ఇప్ప‌టికే పూర్తైంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ‘ఫిదా’ పిల్ల సాయి ప‌ల్ల‌వి.. నాని స‌ర‌స‌న న‌టిస్తోంది. శ్రీరామ్‌ వేణు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తెగఎదురుచూస్తున్నారు.

Nani MCA movie shooting in warangal

Nani MCA movie shooting in warangal

Nani MCA movie shooting in warangal

Nani MCA movie shooting in warangal

nani