నానితో ‘ఆది’ సినిమా అనౌన్స్‌మెంట్‌..

Natural Star Nani,Aadhi Pinisetty, Taapsee, Ritika Singh,NinnuKori, Kona Film Corporation,MVV cinema,Title Poster Announcement

నాని హీరోగా విజయాన్ని సాధించిన ‘నిన్ను కోరి’ సినిమా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని ప్రేమించుకోవడం అనే రెండు రకాల కాన్సెప్ట్‌లతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కాలంలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల పాత్రలతో దూసుకుపోతున్నాడు ఆది పినిశెట్టి. నిన్ను కోరి చిత్రం ద్వారా ఆది ఓ సాఫ్ట్ క్యారెక్టర్‌లో పరిచయం అయ్యాడు. భావోద్వేగాల మధ్య నలిగే పాత్రను చాలా సులభంగా తనకు తగినట్టుగా మలిచుకొన్నాడు. బాధ్యతాయుతమైన భర్తగా సరికొత్తగా కనిపించాడు. నిన్ను కోరి సినిమాలో ఆది స్లయిలిష్ లుక్స్‌తో ఆలరించాడు.

Natural Star Nani,Aadhi Pinisetty, Taapsee, Ritika Singh,NinnuKori, Kona Film Corporation,MVV cinema,Title Poster Announcement

అయితే నిన్ను కోరి సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ వారు ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనుండగా .. తాప్సి .. రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు.

Nani to Unveil the Title Of Aadhi Pinnisetty's Next Movie

ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను హీరో నానితో ఎనౌన్స్ చేయించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడి చేయనున్నారు. కొంతకాలంగా తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆది పినిశెట్టి, ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఆడియన్స్ ను పలకరించనుండటం విశేషం.