ఎంత బాగుంది అంటే..

Nani tweet on mahanati movie..

అలనాటి అందాల తార సావిత్రి..ఆమె సినీ ప్రస్థానం సినీ పరిశ్రమపై చెరగని సంతకం. ఆమె నటన, అభినయంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని మహానటిగా ఎదిగారు. సావిత్రి సినిమా జీవితంలో ఆమె అడుగులపై, నిజ జీవితంలో అమె ప్రయాణంపై బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’.

వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. సావిత్రి పాత్రలో నటించి మంచి నటనను కనబరిచింది నటీ కీర్తీ సురేష్. ఈమెతో పాటు సమంత, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్ వంటి నటీనటులు సీనియర్ నటీనటుల పాత్రలో నటించి ప్రశంసలందుకుంటున్నారు.

Nani tweet on mahanati movie..

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మెగా ప్రాజెక్టుకు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రానికి వివిధ రంగాల ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీపై ట్విట్టర్ వేదికగా స్పందించారు నాచురల్ స్టార్ నానీ. ఎంత బాగుంది అంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. ‘కీర్తి సురేశ్‌ తప్ప మరెవ్వరూ సావిత్రి గారి పాత్రను ఇంత బాగా పోషించలేరు. నాగి (డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌) ని చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్‌, సామ్‌, విజయ్‌, డాని, మిక్కిజే అందరికీ ధన్యవాదాలు’అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు నానీ.