మూగవాడిగా నారా రోహిత్..

NaraRohith full length dumb role movie

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. సినిమా సినిమాకు కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నారా వారాబ్బాయి తాజాగా మరో ప్రయోగంతో రానున్నాడు. మూగవాడిగా నటించబోతున్నాడు. కమల్ పుష్పకవిమానం వంటి మూకీ సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించగా ఇన్నేళ్ల తర్వాత ఓ హీరో టాలీవుడ్‌లో సినిమా మొత్తం మాటలు లేకుండా నటిస్తుండటం విశేషం.

మంజునాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనుండగాసినిమా కథ నచ్చడంతో రోహిత్ వెంటనే ఓకే చెప్పేశాడట. శ్రీవైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణరావు అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది రోజున సినిమా ప్రారంభం కానుండగా రోహిత్ కు ఇది 18వ మూవీ. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్‌లో కళ్లు లేని పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం 1985 కాలం నాటి కథ ఆధారంగా తెరకెక్కుతున్న రంగస్ధలంలో చెవిటివాడిగా నటిస్తుండగా నారా రోహిత్ ఒక అడుగు ముందుకేసి మూగవాడిగా నటించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ చిత్రానికి కథ-మాటలు: వంశీ రాజేష్, ప్రొడక్షన్స్ డిజైనర్: రవిందర్, పి.ఆర్.ఓ: వంశిశేఖర్, సంగీతం: వికాస్ కురిమెళ్ళ, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీఎల్ రిచర్డ్ ప్రసాద్, సమర్పణ: డా. సౌజన్య అట్లూరి, బ్యానర్: శ్రీ వైష్ణవీ క్రియేషన్స్, నిర్మాత: నారాయణ రావు, అట్లూరి, దర్శకత్వం: పిబి మంజునాథ్.

దీంతో పాటు ప్రస్తుతం తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆట నాదే వేట నాదే సినిమాలో నటిస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమాలో రోహిత్ పాత్ర కీలకం కానుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.