16న నయన్‌..కర్తవ్యం

Nayanthara’ Karthavyam release date

విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కర్తవ్యం సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అదే టైటిల్‌తో నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కర్తవ్యం.ఇటీవలె సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 16న ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్‌…. కలెక్టర్ గా మనకు కనువిందు చేయనుంది. తమిళం లో విడుదలైన ఈ చిత్రం నయనతార ఇమేజ్‌ను మరింతగా పెంచేసింది. తెలుగులో కూడా సినిమా హిట్‌గా నిలుస్తుందని నయన్ విశ్వాసంతో ఉంది.

ఈ సందర్భంగా ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ “తమిళం లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన నిర్మాత శరత్ మరార్ తో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేయటం చాల సంతోషం గా ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కర్తవ్యం చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం.”మన్నారు. ఇక ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందించగా, చక్రం, డేంజర్ మరియు కృష్ణార్జున చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్ గా వ్యవహరిస్తున్నారు.