నెహ్రాజీ….సెల్యూట్..!

Nehra Announces Retirement Twitter Turns Emotional

లేటు వయసులో టీమిండియాలో చోటు దక్కించుకున్న పేస్ బౌలర్‌ అశిష్ నెహ్రా  ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు.  నవంబర్‌లో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 మ్యాచ్‌ తన కెరీర్‌లో చివరిదని నెహ్రా ప్రకటించాడు. 38ఏళ్ల వయసులో తిరిగి  భారతజట్టులో స్ధానం సంపాదించిన నెహ్రా…జట్టుకు మరచిపోలేని విజయాలను అందించాడు.

ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో పాటు నెటిజన్లు  నెహ్రా అందించిన విజయాలను గుర్తుచేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.  నెహ్రాజీ.. నిన్ను కచ్చితంగా మిస్సవుతాం. నీ బౌలింగ్ తో పాటు నీ ఎయిర్ ప్లేన్ సిలబ్రేషన్స్ కూడా ఇక ముందు కనిపించదు అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దాదాపు 40 ఏళ్ల వయసులో జట్టులోకి రావడం చాలా కష్టం..అటువంటిది లేటు వయసులో జట్టులో చోటు సంపాదించిన నెహ్రా ఇక ఫీల్డ్ లో కనిపించడు’అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. దిగ్గజ బౌలర్ కు బ్యాట్లు సాల్యూట్ చేస్తున్నాయి’అని మరో అభిమాని ప్రశంసించాడు.

Nehra Announces Retirement Twitter Turns Emotional
1999 శ్రీలంక టూర్ లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. తన కెరియర్ లో 17 టెస్టులు మాత్రమే ఆడిన నెహ్రాకు 44 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. అజారుద్దీన్ దగ్గరి నుంచి గంగూలీ, ద్రావిడ్, ధోని, కోహ్లీ సారధ్యంలో జట్టకు ప్రాతినిధ్యం వహించాడు.

2001 సిరీస్ లోభాగంగా హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన నెహ్రా మొత్తం 120 మ్యాచ్ లు ఆడి 157 వికెట్లు సాధించాడు. అయితే టీమిండియా తరపున టీ-20 అరంగేట్రం మ్యాచ్ కోసం నెహ్రా 2009 సిరీస్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. నాగపూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన నెహ్రా తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 26 మ్యాచ్ ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 19 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

భారత దేశవాళీ టీ-20 ఐపీఎల్ లో మాత్రం నెహ్రాకు మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు ఆడిన రికార్డు ఉంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్,  ముంబై ఇండియన్స్ ,హైదరాబాద్ సన్ రైజర్స్ తో పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణే వారియర్స్ జట్ల తరపున మొత్తం 131 మ్యాచ్ లు ఆడి 162 వికెట్లు పడగొట్టాడు.

తన కెరీర్‌లో  నెహ్రా ఎప్పుడు కూడా చెత్త ప్రదర్శన ఇచ్చి దూరం కాలేదు.. కేవలం గాయాల కారణంగానే తప్పుకుంటున్నాడు.. తిరిగి జట్టులోకి వస్తూనే ఉన్నాడు. 2005 లో ఆశిష్ నెహ్రా పాదంలో గాయం అయింది. దీంతో అతన్ని జట్టు నుండి తప్పించారు. తన కెరీర్ లో అత్యంత కఠినమైన సమయం అని నెహ్రా చెబుతూ ఉండేవాడు.  చాలా మంది నువ్వు ఇకపై క్రికెట్ ఆడకుంటే చాలా మంచిదని చెబుతూ ఉండేవారని నెహ్రా గుర్తుచేసుకున్నాడు.  అయితే ఆ తర్వాత  క్రికెట్ ఆడాలనే కసితో సాధన చేసి  జట్టులో స్థానం సంపాదించుకోగలిగానని చెప్పాడు.  దాదాపు డజన్ కు పైగా శస్త్రచికిత్సలు నెహ్రాకు చేశారు.

Nehra Announces Retirement Twitter Turns Emotional