బెల్లంకొండతో ఢీ అంటున్న ప్రభాస్ విలన్‌..!

Neil Mukesh plays villan role for bellamkonda movie

జయజానకి నాయక మూవీ హిట్‌తో సక్సెస్ బాటపట్టిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మించనున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాతో దృశ్యం,గోపాల గోపాల,డిక్టేటర్ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఫిబ్రవరి 22న సినిమా ప్రారంభం కాగా నటీనటుల ఎంపికలో దర్శక,నిర్మాతలు బిజీగా ఉన్నారు. సినిమా కథకు తగ్గట్టుగా బెల్లంకొండను ఢీ కొట్టేందుకు బాలీవుడ్‌ విలన్‌ని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన కత్తి సినిమాలో విలన్‌గా నటించిన నీల్ నితిన్‌ ముఖేష్‌ను ఈ సినిమాకు ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాలో విలన్‌గా నటిస్తున్న ముఖేష్‌…బెల్లంకొండను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాడు.

ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి శాంతయ్య, నిర్మాత: నవీన్ సొంటినేని (నాని), నిర్మాణం: వంశధార క్రియేషన్స్, దర్శకత్వం: శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను సాక్ష్యం సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.