రివ్యూ: నేల టిక్కెట్టు

రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా మూవీ నేల టిక్కెట్టు. రెండు భారీ హిట్ సినిమాల తర్వాత రవితేజ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్‌లో పక్కా మాస్ మసాలా ఫ్లేవర్ చూపించిన రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో రవితేజ ఆకట్టుకున్నాడా..?సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం వరుస హిట్స్‌తో దూకుడు మీద ఉన్న కళ్యాణ్ కృష్ణ మరోసారి హిట్ కొట్టాడా లేదా చూద్దాం…

క‌థ‌:

నేల‌టిక్కెట్టుగాడు(ర‌వితేజ‌) ఓ అనాథ‌. హైద‌రాబాద్‌లో త‌న స్నేహితుల‌తో క‌లిసి ఉంటాడు. అనాథ అయిన హీరో ప్ర‌తి ఒక్క‌రిలో త‌న‌కు బంధువుల‌ను వెతుక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలో డాక్టర్ చదువుతున్న మాళ‌విక‌(మాళ‌వికా శ‌ర్మ‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. మరోవైపు ఆదిత్య భూపతి(జగపతిబాబు)కి స్వార్థమెక్కువ. డబ్బుకోసం కన్నతండ్రి(శరత్‌బాబు)ని చంపేస్తాడు. హోంమంత్రి నుంచి ముఖ్యమంత్రి పదవికి ఎదగాలని ఎదురుచూస్తుంటాడు. సీన్ కట్ చేస్తే ఆదిత్య భూపతికి నేల టిక్కెట్టుకి మధ్య గొడవ జరుగుతుంది. రవితేజ-ఆదిత్య మధ్య గొడవలకు కారణం ఏంటి? చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రవితేజ,సినిమాటోగ్రఫీ. రవితేజ తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. మాస్ డైలాగ్‌లతో ప్రేక్షకులతో విజిల్స్‌ వెయించాడు. హీరోయిన్ గ్లామ‌ర్ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. గ్లామర్‌ సన్నివేశాల్లో ఇరగదీసిన మాళవిక మిగితా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. అలీ, ప్రియ‌ద‌ర్శి, పృథ్వి వంటివారున్నా కామెడీ పెద్దగా పండ‌లేదు.

nela ticketమైన‌స్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క‌థ‌లో కొత్త‌దనం లేక‌పోవ‌డం,కామెడీ లేకపోవడం, నేప‌థ్య సంగీతం. ల్యాగ్ బాగా ఎక్కువైంది. ఫస్టాఫ్‌లో అస‌లు క‌థేంటో అర్థం కాదు… సెకండాఫ్‌లో క‌థ న‌త్త న‌డ‌కన సాగుతుంది. న‌డుస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. నేప‌థ్య సంగీతం కూడా సోసోగా ఉంది. శక్తినాథ్‌ సంగీతంలో మెరుపు తగ్గింది. పాటలేవీ చెవికి ఇంపుగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ సూపర్బ్. దర్శకుడు కల్యాణ్‌ బలమైన కథను రాసుకోవాల్సింది. దాన్ని తీర్చదిద్దడంలో నైపుణ్యం కొరవడింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

భారీ అంచనాల మధ్య మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నేల టిక్కెట్టు. రవితేజ నటన,సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథ,కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ర‌వితేజ చేసిన చాలా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో ఇదీ ఒక్క‌టి అన్న‌ట్టుగా నిలిచే చిత్రం నేల టిక్కెట్టు.

విడుదల తేది:25/05/2018
రేటింగ్:2.25/5
నటీన‌టులు: ర‌వితేజ‌, మాళ‌వికా శ‌ర్మ‌
సంగీతం: శ‌క్తికాంత్ కార్తీక్‌
నిర్మాత‌: రామ్ తాళ్లూరి
ద‌ర్శ‌క‌త్వం: క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌