ట్రెండింగ్‌లో నేల టిక్కెట్టు టీజర్..

Nela Ticket Theatrical Trailer

రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు చిత్రాల‌తో సక్సెస్ బాట పట్టిన మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వంలో నేల టిక్కెట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ చేత ఆడియోను విడుదల చేయించగా… తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుద‌ల చేశారు.

అనుబంధాలు, ఆప్యాయతలకు విలువనిచ్చే ఓ యువకుడు తనవారి క్షేమం కోసం ఏం చేశాడన్నదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడ్రా.. కాని సాయం చేసేవాడు ఒక్కడూ లేడు .. అందుకే చుట్టూ జనంలో జనంలో మనం అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ టైం లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఓ కొత్త రిలేషన్ కనిపిస్తుందిరా..ముసలితనం అంటే చేతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం..అంటూ డైలాగ్‌లను పేల్చేశాడు రవితేజ.

కామెడీ, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో విడుదల చేసిన ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. రవితేజ సరసన మాళ‌విక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. శక్తికాంత్ చిత్రానికి సంగీతం అందించారు. ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..