రివ్యూ : నేనే రాజు నేనే మంత్రి

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న హీరో రానా. భళ్లాల దేవుడిగా భయపెట్టినా….వీర సైనికుడిగా శత్రుసేనల్ని తుదముట్టించిన అది రానాకే చెల్లింది.  తాజాగా సోలో హీరోగా ఒక్క హిట్టు కూడా కొట్టని రానా…నేనే రాజు నేనే మంత్రితో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అని తెలియాలంటే కథలోకి ఓ లుక్కేదాం..

కథ:

జోగేంద్ర (రానా దగ్గుబాటి) విలేజ్‌లో వడ్డీవ్యాపారం చేసే యువకుడు. జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి ప్రాణం. తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల జోగేంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం తనికెళ్ల భరణి కేబినెట్‌లో మంత్రి అవుతాడు. తనకు ఎదురైన కొన్ని సంఘటనలతో తానే సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే పార్టీలోని పరిస్థితులు అందుకు సహకరించక పోవడంతో తన పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా చేస్తాడు. ఎలాగైనా సీఎం కావాలని జోగేంద్ర కలలు కంటాడు. అందుకోసం అతను కుర్చీలాటను మొదలు పెడతాడు. చివరకు ఆ ఆటలో ఎవరు విజేతగా నిలుస్తారు? జోగేంద్ర చివరికి ఏం సాధిస్తాడు? ఏం పొగొట్టుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Nene Raju Nene Mantri Theatrical Trailer
ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రానా నటన, ఫస్టాఫ్, జోగేంద్ర రాజకీయ వ్యూహాలు, సినిమాటోగ్రఫీ.  రానా పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్. తనదైన నటనతో రానా జీవించాడు. రానా, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. జోగేంద్రగా రానా, రాధగా కాజల్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించాడు. ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. వాడు జోగేంద్ర..అంటూ డైలాగ్‌ చెబుతూ మరోవైపు ప్రభాస్‌ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు. మిగితా వారు తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌, పూర్ క్లైమాక్స్.  సెకండాఫ్ లో ఓవర్ డోస్ సెంటిమెంట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తేజ ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించాడు. ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. స్క్రీన్‌ప్లే పరంగా క్లారిటీతో సినిమా సాగుతుంది. అనూప్‌ నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప‌రావాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

Nene Raju-Nene Mantri review
తీర్పు:

చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ.. భారీ అంచనాలతో తెరకెక్కించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి ప్రయాణాన్ని తెరకెక్కించే ప్రయత్నమే ఈ చిత్రం. రానా నటన, ఫస్టాఫ్, జోగేంద్ర రాజకీయ వ్యూహాలు సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్, క్లైమాక్స్ సినిమాకు మైనస్ పాయింట్స్. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు…?  సానుభూతి ఓట్లు వేయడంజజ? వారసత్వ రాజకీయాలు మీద తేజ చెప్పించే డైలాగ్స్ అందరికి నచ్చుతాయి. మొత్తంగా అందరికి నచ్చే తేజ-రానా… నేనే రాజు నేనే మంత్రి.

విడుదల తేదీ:11/08/2017
రేటింగ్ : 3/5
నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ