బీఎండబ్ల్యూలో తండ్రి అంత్యక్రియలు..

nigeria

అవును మీరు చదివింది నిజమే. తండ్రిపై ఉన్న ప్రేమతో ఏకంగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో తండ్రి మృతదేహాన్ని పెట్టి సమాధి చేశాడు ఓ వ్యక్తి. అంతేగాదు ఆ కారులో తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా శాటిలైట్‌ నావిగేషన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. నైజిరీయాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

నైజీరియాలోని అనంబ్ర రాష్ట్రానికి చెందిన అజుబుయ్‌ అనే వ్యక్తి తండ్రి ఇటీవలె అనారోగ్యంతో మృతిచెందాడు. తాను చనిపోయాక తన మృతదేహాన్ని బీఎండ్యబ్లూ కారులో పెట్టి సమాధి చేయమని చెప్పాడట. దీంతో తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఏకంగా దాదాపు రూ. 44 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. మృతదేహాన్ని కారులో పెట్టి సమాధి చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో 21వేల మంది షేర్‌ చేశారు.

Image result for Nigerian man buries father in brand new BMW car

అయితే దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది అజుబుయ్‌ని మెచ్చుకోగా మరికొంతమంది తండ్రిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీని బదులు పేదలకు సాయం చేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.