పెళ్లి పనుల్లో యంగ్‌ హీరో..

నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమై ఎంతగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హ్యాపీ డేస్‌ సినిమా తర్వాత విజయాలు లేక కొంచెం సతమత మయిన ఈ కుర్ర హీరో స్వామి రారా నుంచి విజయాలను అందుకుంటున్నాడు. రీసెంట్ గా కేశవా సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు ఓ కొత్త తరహా చిత్రంతో రాబోతున్నాడు. కన్నడ లో సూపర్ హిట్ అయిన “కిరిక్ పార్టీ” ని తెలుగులో తీసుకువస్తున్నాడు ఈ యువ హీరో.

Nikhil to Act in Remake of Kirik Party

కన్నడ లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎంతగా అంటే 4 కోట్లతో నిర్మితమైన “కిరిక్ పార్టీ” ఏకంగా 50 కోట్లను కొల్లగొట్టిందని సమాచారం. క్యాంపస్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కే ఈ సినిమాని శరన్ కొప్పిశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ సరసన కన్నడ వెర్షన్ లో నటించిన రష్మిక – సంయుక్త అనే ఇద్దరు హీరోయిన్లనే సెలెక్ట్ చేశారట. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

అయితే ఈ యంగ్‌ హీరో పెళ్లి కుదిరింది. హైదరాబాద్‌కి చెందిన తేజస్వినీతో ఈ నెల 24న నిశ్చితార్థం జరగనుంది. అక్టోబర్‌ 1న ఈ ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చోనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. రీసెంట్ గా జిమ్ బిజినెస్ మొదలు పెట్టిన నిఖిల్ ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ వివాహం అయిన వెంటనే నిఖిల్‌ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.