‘చల్ మోహన రంగ’ టీజర్‌..

Chal Mohan Ranga Teaser

లై సినిమాతో కాస్త ఢీలా పడ్డా నితిన్… ఛల్ మోహనరంగ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. పవర్ స్టార్ పవన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర రెడ్డి ఈ మూవీ సమర్పకులు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ కి ఇది 25 వ సినిమా. ” లై ” చిత్రం హీరోయిన్ మేఘా ఆకాష్ ఇందులో నితిన్ కి జోడీగా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు, తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఏప్రిల్ 5 న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి)14న చల్ మోహన రంగ టీజర్‌ ని విడుదల చేశారు చిత్ర బృందం.  ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ఆదివారం ఉదయం విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉంది. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో షూటింగ్ జరుపున్న ఈ చిత్రానికి ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ పూర్తైంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్నారు.

https://youtu.be/MmuLPGu58bQ