కాస్ట్లీ లై.. రోజుకు రూ. 25 లక్షలు !

Nitin's LIE costs Rs.25 laks per day in USA
Nitin's LIE costs Rs.25 laks per day in USA

‘అఆ’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత యూత్‌స్టార్‌ నితిన్‌ నటిస్తోన్న చిత్రం ‘లై’. ‘అందాల రాక్షసి’, కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా.. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఫస్ట్‌టైమ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌ 11న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక స్క్రీన్‌లలో భారీగా రిలీజ్‌ అవుతుంది.

ఈ సంధర్బంగా లై బృందం బుధవారం సాయంత్రం తిరుపతికి విచ్చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నితిన్‌ మాట్లాడుతూ.. ‘అ ఆ’ చిత్రం తర్వాత ప్రేక్షకులు తనపై అపార నమ్మకం పెట్టుకున్నారన్నారు. ఈ సినిమా అబద్ధంతో మొదలవుతున్నందున ‘లై’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

After the super success of 'A.Aa', young hero Nithin took time for his next. ...

తన గత చిత్రాలకన్నా ‘లై’ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని నితిన్‌ అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అర్జున్‌ది చాలా పవర్‌ఫుల్‌ పాత్ర అని.. చాలా ఏళ్ల తర్వాత ప్రముఖ ఆయనతో కలిసి తాను ఈ చిత్రంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికాలో 75 రోజుల పాటు షూటింగ్‌ జరిగిందని, వెగాస్‌ కేసినోలో కాస్ట్‌లీ ఎపిసోడ్స్‌కు రోజుకు రూ.25 లక్షలు చెల్లించే వాళ్లమని తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు లై సినిమాను భారీగా తీశారని చెప్పారు. దర్శకుడు హనురాఘవపూడి, నిర్మాత గోపి అచంట లేకపోతే ఈ సినిమా లేదన్నారు. ఈ సినిమా అశ్లీలతకు తావులేకుండా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లు చెప్పారు.