రోడ్డుపై జలకన్య

mermaid

అప్పుడెప్పుడో వెంకటేష్ నటించిన సాహసవీరుడు సాగరకన్య సినిమాలో జలకన్యను చూసి..ఓ సముద్రం లో జలకన్య ఇలా ఉంటుందా అని అంత అనుకున్నాం..కానీ ఇప్పుడు బెంగుళూర్ రోడ్ల ఫై జలకన్య కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చాలాచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి.. అందులో నీరు చేరి.. చిన్నపాటి నీటి సరస్సులను తలపిస్తున్నాయి.దెబ్బతిన్న ఈ రహదారుల వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 mermaid

రోడ్లపై వాహనదారుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బాదల్‌ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రద్దీగా ఉండే ఎంజీ రోడ్డుకు సమీపంలో.. పరేడ్‌ గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న జంక్షన్‌లో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బాదల్ శుక్రవారం ఓ చిన్నపాటి సరస్సును చిత్రించాడు. సోను గౌడ అనే మోడల్‌ జలకన్యగా.. ఆ చిన్నపాటి సరస్సు వద్ద తచ్చాడుతూ కనిపించింది. నిత్యం రద్దీ ట్రాఫిక్‌ జామ్‌లో ప్రయాణించే వాహనదారులు కొంతసేపు ఆగి.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. పలువురు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.