యన్టీఆర్ షోలో డ్రగ్స్‌ బ్యాచ్‌..?

బిగ్ బాస్ నేటి నుంచి స్టార్ మా లో ప్రసారం అవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు జూనియర్ యన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. యంగ్‌టైగర్‌ హోస్ట్‌గా చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ షోకి ఒక్కసారిగా తెలుగునాట క్రేజ్ వచ్చేసింది. అలానే ఈ షోలో 12 మంది సెలబ్రెటీలు పాల్గొనబోతున్నారంటూ స్టార్ మా టీవి ప్రచారం చేయడంతో వారెవరో తెలుసుకునేందుకు వ్యూయర్స్ ఆసక్తి చూపుతున్నారు. కానీ తాజాగా తెర పైకి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమని చిత్రవధ చేస్తున్న డ్రగ్స్ స్కామ్ ఇప్పుడు బిగ్ బాస్ షోని కూడా తాకిందని వార్తలు వినిపిస్తున్నాయి.

NTR's Bigg Boss Telugu to roll from July 16

అయితే ఎక్సేజ్ శాఖ నోటీసులు ఇచ్చిన తారల్లో కొందరు బిగ్ బాస్ షోలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కున్న తారలను తమ షోలో ఉంచాలో లేక ఎలిమినేట్ చేయాలో తెలియని అయోమయ స్థితిలో స్టార్ మా వారు ఉన్నట్లుగా తెలిసింది. మరోవైపున తారక్ అభిమానులు నుంచి కూడా ఈ షో పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన షోలో డ్రగ్స్ బ్యాచ్ ఉన్నట్లు యన్టీఆర్ కూడా తెలియదట.

NTR's Bigg Boss Telugu to roll from July 16

ఇక ఇదే షోలో సంపూర్ణేష్ బాబు కూడా పాల్గొనేందుకు అంగీకరించడం సంచలనంగా మారింది. అలానే ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా టెలికాస్ట్ కాకుండానే బిగ్ బాస్ కి ఇన్ని అడ్డంకులు వస్తే రానున్న రోజుల్లో ఇంకెన్ని వస్తాయో చూడలి.