కోటీ మంది మెచ్చారు

జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్‌లతో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. ఈ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించి బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది‌. తాజాగా కేవ‌లం యూ ట్యూబ్ లో కోటి వ్యూస్ సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

 ట్రైలర్ కి ఇంత భారీ రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మూవీ సంచలనాలు క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌటే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలలో కనిపించనుండగా, ఆయన సరనస రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. సెప్టెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.