ఆఫీసర్ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది…

Officer song Navve Nuvvu: This song starring Nagarjuna describes the father-daughter relationship perfectly

రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆఫీసర్ . 25 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పూర్తిగా యాక్షన్ మూవీగా చిత్రికరించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈసినిమాను జూన్ 1వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈసందర్భంగా ఈసినిమాకు సంబంధించి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తండ్రి కూతురు మధ్య సాగే సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. నువ్వే నువ్వే అంటూ ఈసాంగ్ మొదలవుతుంది. తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్ చిత్రాలను ఈసాంగ్ చూపించారు.

Officer song Navve Nuvvu: This song starring Nagarjuna describes the father-daughter relationship perfectly

ఒక వైపున తండ్రీ కూతుళ్ల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతూనే, మరో వైపున వృత్తి పరంగా నాగ్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్ ఈ సాంగ్ లో చోటుచేసుకున్నాయి. ఈపాటను రచయిత సిరాశ్రీ రాయగా రవిశంకర్ మ్యూజిక్ ను అందించాడు. ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈసినిమాను దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సొంత బ్యానర్ అయిన కంపెనీ ప్రొడక్షన్ నిర్మించారు. 25ఏళ్ల తర్వాత విరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచానాల మధ్య సినిమా విడుదలవుతోంది.