మామాకోడ‌ళ్ల విశ్వ‌రూపం చూడ‌బోతున్నారు…!

Omkar on Raju Gari Gadhi 2

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజు గారి గది-2. రేపు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో   నాగార్జున,సమంతతో కలిసి ఓంకార్ మీడియా సమావేశం నిర్వహించారు. సినిమాలో నాగార్జున,సమంత విశ్వరూపం చూడబోతున్నారని చెప్పిన ఓంకార్….సమంత కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందన్నారు.

పెద్ద హీరోతో సినిమా తీస్తున్నాన‌న్న భ‌యం త‌న‌లో లేకుండా నాగార్జున చేశార‌ని అన్న ఓంకార్‌..మూడో సినిమాకే ఆయనతో చేసే అవకాశం లభించిందన్నారు. రాజుగారి గ‌ది లాంటి చిన్న సినిమా చేసిన నాగ్‌, స‌మంతకి కూడా తాను రుణ‌ప‌డి ఉంటానని చెప్పారు. సినిమా విడుదల కోసం తాను ఎంత‌గానో ఎదురు చూస్తున్నానని చెప్పారు.  వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీని ఇర‌గ‌దీశార‌ని అన్నారు. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా సినిమా ఉంటుందని చెప్పారు.

Omkar on Raju Gari Gadhi 2
తాను ఇప్పుడు అక్కినేని స‌మంత అని, అక్కినేని వారి కోడ‌లిని అయ్యాన‌ని స‌మంత వ్యాఖ్యానించింది.  అక్కినేని కుటుంబంలో ఆడ‌వారికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారని, అమ‌ల ఎంతో ఇండిపెండెంట్‌గా ఉంటార‌ని చెప్పింది. అక్కినేని అనేది ప‌వ‌ర్ ఫుల్ నేమ్ అని వ్యాఖ్యానించింది. తాను త‌న బెస్ట్ ఫ్రెండ్‌ నాగచైతన్యని పెళ్లి చేసుకున్నాన‌ని పేర్కొంది.

అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత రిసెప్షన్ ఎప్పుడు జ‌ర‌పాల‌నే విష‌యంపై ఆలోచిస్తున్నామ‌ని అక్కినేని నాగార్జున అన్నారు. ఈ తేదీ ఎప్పుడ‌ని స‌మంత‌, నాగార్జున కూడా త‌న‌ను అడుగుతున్నార‌ని చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాగార్జున… స‌మంత చాలా తెలివిగ‌ల‌దని, రాజుగారి గ‌ది-2 సినిమాలో తాను చేసేది చిన్న పాత్ర అయినా ఆ పాత్ర‌కి ప్రాధాన్యత‌ ఉంటుంద‌ని ఒప్పుకుంద‌ని చెప్పారు.

తాను నేను సమంతకి పెద్ద ఫ్యాన్ అని నాగార్జున అన్నారు. ఏమాయ చేశావే సినిమాలో స‌మంత న‌ట‌నను చూసిన త‌రువాత తాను స‌మంత‌కి ఫ్యాన్ అయిపోయానని తెలిపారు.  స‌మంత త‌న కంటే బాగా చేసిందని అన్నారు.ఈ సినిమా తనకు చాలా స్పెష‌ల్ అని, ఎందుకంటే అక్టోబ‌ర్ 6న స‌మంత‌, చైతూ పెళ్ల‌యిందని, ఈ సినిమా హిట్ కాక‌పోతే స‌మంత‌, తాను ఒక‌రిముఖం ఒక‌రం ఎలా చూసుకుంటామ‌ని చ‌మ‌త్క‌రించారు.  ఈ సినిమా కోసం ఓంకార్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని చెప్పారు.