నిన్న కన్నుతో….నేడు గన్నుతో

Oru Adaar Love latest teaser

ప్రియా వారియర్…ఇప్పుడు పేరే ఎక్కడా చూసినా వినిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. ‘ఒరు అదార్‌ లవ్‌’ మూవీలో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ‘మానిక్యా మలారాయ పూవి’ అనే సాంగ్‌లో ప్రియా క‌న‌బ‌ర‌చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌కి యూత్ ఫిదా అయిపోయింది. అంతేకాదు గూగుల్ అన‌లిటిక్స్‌లో స‌న్నీ లియోన్‌, క‌త్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకోనేలను బీట్ చేసి టాప్ పొజిషన్‌కు వచ్చేసింది.

ప్రియా చూపులు చెప్పే కొత్త ఊసుల మత్తుకు, గమ్మత్తుకు యువత చిత్తయిపోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో మరోసారి తన హావభావాలతో ఆకట్టుకుంది ఈ కేరళ కుట్టి.ముద్దును గన్‌లో లోడ్‌ చేసి మరీ పేలిస్తే ఆ దెబ్బకు ఆమె ప్రేమికుడే కాదు.. చూస్తున్న యువకులకు ఒక్కసారిగా ప్రాణం ఆగినంత పనైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లోకి రానుంది.