బాలయ్య బాగానే వసూల్‌ చేస్తున్నాడు…

Paisa Vasool Business On

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో నందమూరి అభిమానుల్ని మెప్పించిన బాలయ్య ఆ వెంటనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించేందుకు అంగీకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వేడి తగ్గక ముందే పూరీ ఈ ప్రాజెక్ట్ కి పైసా వసూల్ అని పేరు పెట్టేయడం అంతే వేగంగా షూటింగ్ ను దాదాపు చివరి దశకి తీసుకురావడం జరిగిపోయాయి.

Paisa Vasool Business On

అంతేకాదు మాస్ ఆడియన్స్ ను అలరించడమెలాగో హీరోగా బాలకృష్ణకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కి బాగా తెలుసు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్నఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఒక్కో రోజున ఒక్కో ఏరియాకి సంబంధించిన డీల్ ను క్లోజ్ చేస్తున్నారట. అలా ఇప్పటికే నైజామ్,సీడెడ్, ఓవర్సీస్ బిజినెస్ ను క్లోజ్ చేసినట్టుగా సమాచారం.

ఇక గుంటూరు ఏరియా హక్కులను కూడా నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల దగ్గర బిజినెస్ క్లోజ్ చేసినట్టు సమాచారం. వైజాగ్ ఏరియాకి సంబంధించిన హక్కుల విషయంలో చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, డీటీఎస్ మిక్సింగ్ కి సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో ఫస్టు కాపీ వస్తుందనీ .. సెప్టెంబర్ 1న విడుదల చేయడం ఖాయమని చెబుతున్నారు.