నేను బాలయ్య అభిమానిని…

Paisa Vasool Making of Stumper 101

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ  హీరోగా పైసా వసూల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన పైసా వసూల్ స్టంపర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

తాజా ఆడియో రిలీజ్‌కు ముందు ట్రీట్‌గా పైసా వసూల్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రయూనిట్.  ఈ వీడియోలో ముఖ్యంగా బాల‌కృష్ణ చేస్తోన్న ఫైట్స్, సాహ‌సాలు క‌న‌ప‌డుతున్నాయి. పైసా వ‌సూల్ మేకింగ్ ఆఫ్ స్టంప‌ర్ 101 అంటూ విడుద‌ల చేసిన ఈ వీడియోను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. నేను బాల‌కృష్ణ అభిమానిని, ఇప్పుడు నాకు 101 జ్వ‌రం ఉంది అని పూరీ పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా బాలకృష్ణ‌తో తాను దిగిన ఫొటోను కూడా పోస్ట్‌చేశాడు.

ఇక ఈ సినిమా ఆడియో వేడుకను ఆగస్టు 17వ తేదీన నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకి ‘ఖమ్మం’ వేదిక కానుంది. ఖమ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుకను జరపనున్నారు.