సీఎం.. సీఎం అని అరిస్తే అవను… ఓట్లేస్తే అవుతా-పవన్

Pawan Kalyan's JanaSena Porata Yatra In Srikakulam

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ రాజకీయ రంగప్రవేశం చేశాక ఆయన అభిమానులు తమ హీరో సీఎం కావాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా ఇచ్చాపురం బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. మీరు సీఎం సీఎం అంటూ అరిస్తే నేనే సీఎం అవను. మీరు ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం అవుతా అని అన్నారు.Pawan Kalyan's JanaSena Porata Yatra In Srikakulamఓటర్ కార్డు తీసుకుని మీరు ఓట్లు వేస్తే నేను సీఎం అవుతా. మీ అమ్మానాన్నలతో కూడా ఓట్లు వేయిస్తేనే నేను సీఎం అవుతా అని చెప్పారు. మీ ఇంట్లో వారికి ఒక్కటే చెప్పండి మీకు దోపిడీ చేసే ప్రభుత్వం, అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వాలు కావాలంటే ఆ పార్టీల వద్దకు వెళ్లమని చెప్పండి. నిజాయతీగా..ఏమీ ఆశించకుండా ప్రజలకోసం పనిచేసే సీఎం, ప్రభుత్వం కావాలంటే మాత్రం ‘జనసేన’ పార్టీకి మద్ధతు ఇవ్వమని చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు.

ఉత్తరాంధ్ర వెనుకబాగుతనం పోవాలంటే, నన్ను సీఎంగా చూడాలంటే మీరంతా నాకు అండగా ఉండండి. ఓట్లను డబ్బుతోకొనే రాజకీయ వ్యవస్తకు స్వస్తి చెప్పండి.. మీ అందరి అండ ఉంటే 2019లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ఆ దేవుడి దయవల్ల.. రంగమ్మతల్లి దయవల్ల శ్రీకాకుళం ప్రజల కష్టాలు తీర్చేందుకు జనసేనకు ఒక్క అవకాశం ఇప్పించమని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు.