బ్యాంకాక్‌లో భారీ ఫైట్స్ చేస్తున్న పవన్..!

పవర్ స్టార్ పవన్ -త్రివిక్రమ్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా అక్కడ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. వాటిలో వున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఉత్కంఠభరితులను చేసేదిలా ఉంటుందని అంటున్నారు.

Pawan Kalyan's upcoming film to be high on action

అక్కడ షూటింగ్ ముగియగానే ఈ సినిమా టీమ్ .. యూరప్ వెళ్లనుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు.