మహానటికి పవన్ ప్రశంసలు…!

Pawan praises Keerthy Suresh

నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్‌. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చిన ఆచితూచి సినిమాలు చేస్తోంది. నానితో నేను లోకల్ మూవీ చేసిన కీర్తి ప్రస్తుతం రైజింగ్‌లో ఉంది.  టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫస్ట్ ఛాయిస్ ‘కీర్తి’కే ఇస్తున్నారు.

తెలుగులో ‘పవన్ కళ్యాణ్’, ‘మహేష్ బాబు’, ‘అల్లు అర్జున్’ ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసిన ఈ భామ.. తమిళ్ లో అగ్రహీరోలతో జతకడుతోంది. ‘విజయ్’ తో ‘భైరవ  చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ ‘సూర్య’, ‘కార్తీ’లతో నటించే ఛాన్స్ అందుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన కీర్తి…గ్లామర్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని, మరో ఐదేళ్ల తర్వాత అడిగినా ఇదే సమాధానం చెబుతానని, ఆ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని  చెప్పింది.   భైరవ  సినిమాలో తన నటన బాగుందని పవన్‌ మెచ్చుకున్నారని తెలిపింది.

‘మహానటి’ సినిమాలో ఆమె నటిస్తున్న విషయమై ప్రశ్నించగా  ‘మహానటి సావిత్రిలా నటించడం చాలా కష్టమైన విషయం. ఆమెలా నటించానని చెప్పడం కరెక్టు కాదు. ఈ సినిమా కోసమే సావిత్రి నటించిన సినిమాలను చూశా. సావిత్రి పాత్రలో నటించాలంటే మొదట్లో తాను భయపడ్డా. కానీ, సవాలుగా తీసుకుని ఆ పాత్రలో నటిస్తానని చెప్పాను.  మీరు మాత్రమే ఈ పాత్రకు వందశాతం నప్పుతారు అని ‘మహానటి’ నిర్మాత నాతో అన్నారు. అంతేకాకుండా, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా అదేమాట చెప్పారు’ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.