You are here
తగ్గనున్న కాల్ చార్జీలు! టాప్ స్టోరీస్ తాజా వార్తలు రాజకీయాలు 

తగ్గనున్న కాల్ చార్జీలు!

దేశీయంగా ఒక టెలికాం నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌ వెళ్లినపుడు, కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద మొదటి నెట్‌వర్క్‌ నిమిషానికి 14 పైసల చొప్పున చెల్లిస్తోంది. కాల్‌ ఛార్జీలు నిర్ణయించేప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే కాల్‌ అందుకునేందుకు నిమిషానికి 30-35 పైసలు ఖర్చవుతున్నందున, ఐయూసీ ఛార్జీని రెట్టింపు చేయాలని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ కోరుతున్నాయి. ఇదే జరిగితే కాల్‌ ఛార్జీలను కూడా పెంచాల్సి వస్తుంది. ముఖ్యంగా అపరిమిత కాల్స్‌ అందించడం ఏ నెట్‌వర్క్‌కు అయినా కష్టం అవుతుంది. తాజాగా ఈ నెట్‌వర్క్‌లకు షాకిస్తూ మొబైల్ ఆపరేటర్లు చెల్లించే ఇంటర్ కనెక్ట్ కాల్ చార్జీలను తగ్గించాలని చేయాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ ప్రత్యర్థి కంపెనీలకు షాకిస్తూ జియో ప్రతిపాదనకు ఓటేసింది.

అయితే డేటాకు మాత్రమే ఛార్జీ చేస్తూ, కాల్స్‌కు ప్రత్యేకంగా రుసుము వసూలు చేయని రిలయన్స్‌ జియో మాత్రం అనుసంధాన ఛార్జీలు రద్దు చేయాలని కోరుతోంది. కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది. జియో ఉచిత కాల్స్ ఆఫర్‌తో ఇంటర్ కనెక్ట్ పేరిట ఇతర కంపెనీలు పెద్దమొత్తంలో చార్జ్ చేశాయి. దీంతో ఐయూసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర కంపెనీలు ఐయూసీ పేరుతో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. అంతేకాదు ఈ చార్జీలను మరింత పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.

Related Articles