హ్యాపీ బర్త్ డే…పూజ హెగ్డే

Pooja Hegde birthday

ఆకట్టుకునే అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘ముకుందా’ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తరవాత తెలుగులో మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా చైతన్యతో ‘ఒక లైలా కోసం’అంటూ మెరుపులు మెరిపించింది. ఇవాళ పూజా పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజ 2010లో విశ్వసుందరీ విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో  ‘మెహెన్ జోదారో’సినిమాతో మెప్పించింది.

Pooja Hegde birthday
రీసెంట్‌గా స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెసైంది ఈ బ్యూటీ.గుడిలో.. బడిలో…ఒడిలో నువ్వే అంటూ బన్నీతో స్టెప్టులేసిన ఈ బ్యూటీ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో పూజా బికినీషోతో  చాలా గ్లామరస్‌గా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.

దీంతో పూజకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాంచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాలో ప్రత్యేక ఐటం సాంగ్‌లో నటిస్తోందని టాక్‌. అంతేగాదు  రేస్ త్రి సినిమాలో నటించాలని చిత్రయూనిట్ పూజా హెగ్డేని సంప్రదించిందని….దీనికి పూజ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. మొత్తంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ డీజే భామ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

Pooja Hegde birthday