‘సచ్చిందిరా గొర్రె’..

Popular actress Anasuya joins the ensemble cast of Sachindi Ra Gorre.

బుల్లితెరపై యాంకర్‌ అనసూయకు ఒక రేంజ్‌లో క్రేజ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూనే.. మరో వైపున సినిమా ఫంక్షన్స్‌లో ఫుల్ బిజీగా వుండే అనసూయ, నచ్చిన పాత్ర దొరికితే చాలు వెండితెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. తన పేరుతో సినిమాల్లో పాటలు పెట్టేంత క్రేజ్ తెచ్చుకున్న అనసూయ, సైలెంట్ గా మరో సినిమా చేసేస్తోందట.

Popular actress Anasuya joins the ensemble cast of Sachindi Ra Gorre.

నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి యర్వా డైరక్షన్ లో.. అనసూయతో పాటు శ్రీనివాస్ రెడ్డి.. శివా రెడ్డి.. శకలక శంకర్ తదితరులు నటిస్తున్న సినిమా ‘సచ్చిందిరా గొర్రె’. ఈ సినిమాలో అనసూయది లీడ్ క్యారక్టర్ అని చెప్పలేం కాని.. ఈ సినిమాలో తన పాత్ర పరిధి ఎంత ఏంటి అనేది చూసుకోలేదు అంటోంది ఈ హాట్ యాంకర్. ఎందుకంటే అమ్మడు కేవలం లీడ్ రోల్స్ మాత్రమే చేస్తానంటూ మడికట్టుకుని కూర్చోలేదట.. పాత్ర బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేసేస్తాను అంటోంది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదో థ్రిల్లర్ కామెడీ అట.

ఇకపోతే ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకుంటోంది. చడీచప్పుడు లేకుండా అప్పుడే రెండో షెడ్యూల్ కూడా తీసేస్తున్నారు. మొత్తానికి మొన్నటివరకు లీడ్ రోల్స్ అనుకుని.. తరువాత మాత్రం ఐటెం సాంగ్స్.. ఆ తరువాత సైడ్ క్యారెక్టర్స్ కు కూడా ఓకే అంటున్న అనసూయ.. ఈ సినిమాతో ఏ రేంజులో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.