చంద్రబాబుపై పోసాని సంచలన వ్యాఖ్యలు

posani

ఏపీ సీఎం చంద్రబాబుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని…సిగ్గులేకుండా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని విజయవాడకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ పోసాని ప్రశ్నించారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనని స్టేలను చంద్రబాబు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. తన రాజకీయ అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాడని చెప్పారు. వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలే చేయడం సరికాదన్నారు. పవన్‌ను అవసరానికి వాడుకున్న చంద్రబాబు అవసరం తీరాక కమ్మ కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నాడు ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విమర్శించటం ఏంటని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు లాక్కొన్నారని, ఆయన చావుకు కారణం అయ్యారని ఆరోపించారు. తను,తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్‌లు మాత్రమే రాష్ట్రాన్ని ఏలాలని చంద్రబాబాబు అనుకుంటున్నారని అన్నారు. కమ్మ కులస్తులు ఆలోచించుకోవాలని, చంద్రబాబుకు వ్యక్తిత్వం ఉందో లేదో గుర్తించాలన్నారు.