టాలీవుడ్‌ పై పోసాని సంచలన కామెంట్స్‌..

తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ప్రముఖ రచయిత, నటుడు పోసాని క‌ృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమలో ఇంకా వెన్నుపోట్లు కొనసాగుతున్నాయని, మానవత్వమనేదే లేకుండా పోతోందన్నారు. ఈ మేరకు ‘ఉంగరాల రాంబాబు’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో పోసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

 Posani Krishna Murali sensational comments on Tollywood..

‘అలీ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. ఈ మధ్య అలీ నా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకు అని అడిగాను. ఓ సినిమాలో ప్రధాన పాత్రలకు నిన్ను, నన్ను తీసుకున్నారని, కానీ, మరొకడు వచ్చి వీళ్లకెందుకు ఇంత డబ్బు ఇవ్వాలి? వీడైతే తక్కువకు వస్తాడు. వాడైతే తక్కువకు వస్తాడు అంటూ తమ ఇద్దరిని సినిమా నుంచి తీసేశారని అలీ చెప్పాడు’ అని పోసాని అన్నారు.

సినీ పరిశ్రమలో ఇన్నాళ్లు కొనసాగిన తర్వాత కూడా ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా? ఇంకా మోసాలు ఉంటాయా? ఇంకా ఇలాంటి వెధవలు ఉంటారా? అని బాధ కలిగినట్టు చెప్పారని వెల్లడించారు. మీద నవ్వులు వేరు, వేదిక మీద యాక్టింగ్‌ వేరని, కానీ.. నిజజీవితంలో ఇలాంటి ఘటనలు చూస్తే గుండెపగిలిపోయేంత బాధ కలుగుతుందని పోసాని అన్నారు .