చీఫ్ గెస్ట్ గా ప్రభాస్‌..

టాలీవుడ్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ వున్న ప్రభాస్ ‘బాహుబలి 2’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేషనల్ వైడ్ స్టార్ అయ్యాడు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేకుండా అన్నిచోట్లా ప్రభాస్‌కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ ఎక్కడికెళ్లినా అక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూ క్రౌడ్ పుల్లర్ అయిపోయాడు.

దీంతో ఈ బాహుబలి స్టార్‌నే నమ్ముకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలని భావించే ఫిలింమేకర్స్ లేకపోలేదు. ఆగస్టు 18న రిలీజ్ కానున్న ఆనందో బ్రహ్మ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 Prabhas as Chief Guest for Taapsee Anando Brahma Movie Pre ...

ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ లాంచ్ చేసి ఆ సినిమాకు మంచి ప్రమోషన్ కల్పించిన ప్రభాస్ రేపు జరగనున్న ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సైతం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.

హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ కీలకపాత్రలో నటించింది. ఇక మహీ వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.