ప్రభాస్…హోట‌ల్ బిల్లే కోట్లలో!

Prabhas Dubai Hotel Bills Crossed 15Crores

బాహుబలి తర్వాత రెబల్ స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో కేవలం దుబాయ్‌ షూట్‌ కోసమే భారీ స్ధాయిలో ఖర్చుచేశారు. 50 రోజుల పాటు 250 మంది యూనిట్‌తో రాత్రిపగలు అనే తేడా లేకుండా అబూదాబిలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఇందుకోసం భారీ స్ధాయిలో ఖర్చుచేశారు.

దుబాయ్ ఎపిసోడ్‌లో కేవలం హోటలు బిల్లులు,విమానాల ఖర్చులే 15 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. సినిమా రిచ్‌గా ఉండేలా సిబ్బందిని అక్కడ అకామిడేట్ చేయాల్సి రావడంతో ఇంత ఖర్చు పెట్టక తప్పలేదట. దర్శకుడు సుజిత్ ఏమిటి? ఇంత భారీ సినిమా ఏమిటి అనుకున్నారా?ఈ సినిమా కోసం పగలురాత్రి అనే తేడాలేకుండా డెడికేట్‌గా పనిచేస్తున్నాడట.

హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో కనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా భారీ ఛేజింగ్ సీన్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ ఛేజింగ్ సీన్ కోసం 37 ఖరీదైన కార్లను .. 4 భారీ ట్రక్కులను ఉపయోగించారు. ఛేజింగ్ లో కార్లు .. ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొడుతూ ధ్వంసమవుతూ ఉంటాయి. దీనిని బట్టి ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.